ప్ర‌భుత్వ ఉద్యోగ సాధ‌న కోసం ఉచిత శిక్ష‌ణ‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

by Ratna Kumari |

గ్రామీణ ప్రాంతాల్లోని పేద నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఆర్థిక భారం లేకుండా చేయాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగ సాధ‌న కోసం ఉచిత శిక్ష‌ణ‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, వెల్దండ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఆర్థిక భారం లేకుండా చేయాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగ సాధనకై ఉచిత శిక్షణను సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ కేంద్రంలో విద్యార్థులకు సబ్జెక్ట్ బోధనతో పాటు స్టడీ మెటీరియల్, ఫిజికల్ ట్రైనింగ్, పరీక్షల ప్రిపరేషన్ అందిస్తామని చెప్పారు. పోలీస్ ఉద్యోగం సాధించాలంటే క్రమశిక్షణ, శ్రమ, నిబద్ధత అత్యవసరమని సూచించారు. మీ విజయం మీ కుటుంబానికి గర్వకారణం కావాలి. మీ సాధన మీలాంటి ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలి అని సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావడానికి ఈ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇలాంటి ఉచిత శిక్షణ కేంద్రాలు గ్రామీణ యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రత్యేకంగా పేద కుటుంబాల విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అని, పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా ఆర్థిక ఇబ్బందులను గుర్తించి, మారుమూల గ్రామీణ ప్రాంత యువతకు తమకు దగ్గరగా అందుబాటులోకి సుంకిరెడ్డి గారతెచ్చిన ఉచిత పోలీస్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని,అందరికి ఆదర్శంగా నిలవాలని సూచిస్తూ,గ్రామాలు తండాలో స్థితిగతులను అర్థంచేసుకుని శిక్షణ శిక్షణ తరగతుల సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తున్న సుంకిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ… ఇలాంటి కోచింగ్ కోసం నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అదే తమ ప్రాంతంలో అందుబాటులోకి రావడం చాలా ఉపశమనం కలిగించిందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పక ఉద్యోగం సాధిస్తామని తెలుపుతూ, సుంకిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గన్యా నాయక్, రవీందర్, రమేష్ నాయక్, ఉప సర్పంచ్ విజయ్, మాజీ సర్పంచ్ లు నారాయణ, పంతుల నాయక్ లతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story