అనుమానాస్పదంగా విద్యార్థి మృతి..

by Disha Web Desk 11 |
అనుమానాస్పదంగా విద్యార్థి మృతి..
X

దిశ, వీపనగండ్ల: ఐదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథన ప్రకారం.. మండల పరిధిలోని పుల్గర్ చెర్ల గ్రామాన్ని చెందిన నీలమ్మ, బక్కన్నల కుమారుడు అనిల్ (11) పెబ్బేర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు.

ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటి వద్దనే సాయంకాలం వరకు ఆడుకున్నాడని రాత్రి కావస్తున్న ఇంటికి రాకపోవడంతో వెతుకగా ఇంటికి సమీపంలోనే చెట్టుకూ ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రామన్ గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ కుమారుడు మృతిపై అనుమానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఎస్ఐ తో వాపోయారు. ఇంత చిన్న వయసులోనే విద్యార్థి ఉరేసుకొని చనిపోవడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Next Story