నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్: అడిష‌న‌ల్ ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు

by Ratna Kumari |

దిశ, కందనూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ తరహాలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు

నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్: అడిష‌న‌ల్ ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు
X

దిశ, కందనూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ తరహాలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గురువారం జిల్లా కేంద్రంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సాఫీగా నడవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు అవసరమున్న ప్రాంతాలను గుర్తించామన్నారు. పట్టణంలోని శ్రీపురం రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతం, బస్టాండ్, నాగనూల్ ప్రాంతాలు ముఖ్యమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో సాంకేతికతను ఉపయోగించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. ఈ సిగ్నల్ వ్యవస్థ అమలు ద్వారా ప్రజలకు సురక్షిత ప్రయాణం కలుగుతుందని ఏఎస్పీ వెల్లడించారు.

Next Story