- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీపీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సురేష్ కుమార్
దిశ, పాన్ గల్ : గ్రామపంచాయతీ ఆఫీసర్ (జిపిఓ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అన్నారం

దిశ, పాన్ గల్ : గ్రామపంచాయతీ ఆఫీసర్ (జిపిఓ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన సురేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. జీపీవోల రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రావ్, ఉపాధ్యక్షుడు బచ్చలకూర పరమేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా ఆకుల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా శివారెడ్డి వెంకటన్న ప్రధాన కార్యదర్శిగా సురేష్ కుమార్ కోశాధికారిగా మల్లేష్ మహిళా అధ్యక్షురాలుగా అంజమ్మ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో జీపీవో ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల వాసి సురేష్ కుమార్ ఎంపిక కావడంతో పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టి జి టి ఏ జిల్లా అధ్యక్షుడు వనపర్తి తాసిల్దార్ రమేష్ రెడ్డి టిజిఆర్ఎస్ఏ డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మీకాంత్ టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ పాల్గొన్నారు.






