- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా నారాయణపేట పట్టణంలో మున్సిపాలిటీ వార్డులలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా నారాయణపేట పట్టణంలో మున్సిపాలిటీ వార్డులలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు, మూడు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండో వార్డులో సుతారి అరుణ్ రాంరెడ్డి, మూడో వార్డులో కాకర్ల నారాయణమ్మను గెలిపించాలని కోరారు. నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవీ ని బిఆర్ఎస్ కైవసం చేసుకొని మున్సిపాలిటీ పై గులాబీ జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, సాగర్ జిరాక్స్ రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






