జేపీఎన్సీఈ కళాశాలకు వరుస ఉత్తమ కళాశాల అవార్డులు

by Nallavelli.Anjaneyulu |

జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలకు ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీ గా వరుస అవార్డులను అందుకుంటుంది.

జేపీఎన్సీఈ కళాశాలకు వరుస ఉత్తమ కళాశాల అవార్డులు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలకు ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీ గా వరుస అవార్డులను అందుకుంటుంది. మొన్నటికి మొన్న జేపీఎన్సీఈ రాష్ట్రంలో ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోగా.. శనివారం రాత్రి హైదరాబాద్ లో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అధికారిక జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా కళాశాల వ్యవస్థాపకుడు, చైర్మెన్ కెఎస్ రవికుమార్ జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో రూరల్ స్థాయిలో ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను అందిస్తూ, అత్యున్నత ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ ప్రవేశాలలో అగ్రస్థానాన్ని సాధించినట్లు గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రముఖ విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు కే.ఎస్. రవికుమార్ ను అభినందనలతో ముంచెత్తారు.

Next Story