స‌బ్సీడీ పై రొటోవేట‌ర్ స్పీక‌ర్లు

by Ratna Kumari |

మండ‌ల వ్య‌వ‌సాయ శాఖ ద్వారా రైతుల‌కు స‌బ్సీడీ పై రోటోవేట‌ర్, హోండా కంపెనీ స్ప్రేయ‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని కొల్లాపూర్ మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి చిన్న హుస్సేన్ యాద‌వ్ తెలిపారు.

స‌బ్సీడీ పై రొటోవేట‌ర్ స్పీక‌ర్లు
X

దిశ‌, కొల్లాపూర్ : మండ‌ల వ్య‌వ‌సాయ శాఖ ద్వారా రైతుల‌కు స‌బ్సీడీ పై రోటోవేట‌ర్, హోండా కంపెనీ స్ప్రేయ‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని కొల్లాపూర్ మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి చిన్న హుస్సేన్ యాద‌వ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కొల్లాపూర్ వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాల‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తు ఫారం, భూమి పాస్ బుక్ (భూమి త‌ప్ప‌నిస‌రిగ్గా ఎక‌రానికి పైగా ఉండాలి), ఆధార్ కార్డు,రోటోవేటర్ కోసం మాత్రం ట్రాక్టర్ ఆర్సీ (ఆర్సీ భార్య లేదా భర్త పేరు ఉండాలి), ఆర్సీ అగ్రికల్చర్ పర్పస్ మాత్ర‌మే ఉండాలి. కమర్షియల్ ఉన్నవి వర్తించవు. రోటోవేటర్ మీద సబ్సిడీ రూ, 50వేలు, స్ప్రేయర్ మీద సబ్సిడీ రూ, 10వేలు, రోటోవేటర్, స్ప్రేయర్లు కావలసిన రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలని చిన్న హుస్సేన్ యాదవ్ తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24 చివ‌రి తేదీ అని వెల్ల‌డించారు. కావాల్సిన వారు వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాల‌ని కోరారు.

Next Story