- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యథేచ్ఛగా సబ్సిడీ గ్యాస్ దందా..
గృహ అవసరాలకు వినియోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు మహబూబ్ నగర్ జిల్లాలో పక్కదారి పడుతున్నాయి.

దిశ, మహబూబ్ నగర్ : గృహ అవసరాలకు వినియోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు మహబూబ్ నగర్ జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలకు అందించే సబ్సిడీ వంటగ్యాస్‌ను హెచ్‌పీ, భారత్, ఇండెన్ గ్యాస్ ఏజేన్సీలు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలను జరుపుతున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రధాన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లలో ఎక్కడ చూసినా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లే దర్శనం ఇస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పదుల సంఖ్యలో డొమస్టిక్ సిలిండర్లు దర్శనం ఇచ్చాయి. అయితే జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం అయిపోతుంది. పేదలకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లు అక్రమ మార్గన పెద్దపెద్ద హోటల్స్‌కు చేరుతున్నా మహబూబ్ నగర్ సివిల్ సప్లయ్ అధికార యంత్రాంగం అంత మామూళ్ల మత్తులో మునిగిపోయిందని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.400 అదనంగా చెల్లిస్తే డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా..
కమర్షియల్ సిలిండర్ల గ్యాస్ ధరతో పోలిస్తే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకు వస్తుండడంతో వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వైపే మక్కవ చూపుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఒక్కో సిలిండర్‌కు రూ.400వరకు అదనంగా తీసుకొని డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. బహిరంగానే వ్యాపారస్తులు డొమెస్టిక్ సిలిండర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నా సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ దందాను జోరుగా నిర్వహించే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను సరఫరా చేయడానికి వినియోగిస్తున్న వాహనాలకు గ్యాస్ ఏజెన్సీ పేరు లేకుండానే నడుపుతున్నారు. అయినా అధికారులకు అన్నీ తెలిసే అక్రమ వ్యవహారం సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రధాన హోటల్స్ అన్నింటికి డొమస్టిక్ సిలిండర్లు
జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అన్ని హోటళ్లు, హాస్టల్స్‌కు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్లో బహిరంగంగానే డొమిస్టిక్ సిలిండర్లను వాడుతున్నారు. ప్రతి రోజు ఈ హోటల్లో పదుల సంఖ్యలో డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక హోటల్స్, హాస్టల్స్‌కు డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ చేస్తూ గ్యాస్ ఏజేన్సీలు అక్రమ మార్గంలో రూ.కోట్లు గడిస్తున్నాయి.
పోటీ పడి అక్రమాలు..
పేదలకు అందాల్సిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీలు పోటీ పడి మరి అక్రమ మార్గన హోటల్స్‌కు డొమస్టిక్ సిలిండర్లను చేరవేస్తున్నాయి. మేము కాస్త ఏక్కువ సప్లయి చేస్తం రేటు కాస్త తక్కువ ఇవ్వండి అంటూ పోటీ పడి మరి హోటల్స్ వద్దకు తమ కంపెనీ సిలిండర్లు చేరవేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ వంటి అన్ని కంపెనీలకు చెందిన సిలిండర్లు పాస్ట్ పుడ్ సెంటర్లలో రెస్టారెంట్లలో ప్రైవేట్ హాస్టల్స్‌లలో దర్శనం ఇస్తున్నాయి. ఇలా అన్ని కంపెనీలకు సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్లు జిల్లా కేంద్రంలోని వివిధ హోటల్స్‌లో దర్శనం ఇస్తున్నా ఆధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. గ్యాస్ ఎజెన్సీల నుంచి ముట్టాల్సినంతా సివిల్ సప్లయి ఆఫీసర్లకు ముడుతుండడంతో ఈ అక్రమ వ్యవహారంపై కిమ్మనడం లేదనే వార్తలు కూడా లేక పోలేదు.






