నల్లగొండ పారుదలకు పాలమూరును ముంచడం సరికాదు

by Ratna Kumari |

పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అందులో భాగంగా మండల పరిధిలోని గోకారం రిజర్వాయర్ ముంపు లో భాగమైన ఎర్రవెల్లి బాధితులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి సంఘీభావం తెలిపారు.

నల్లగొండ పారుదలకు పాలమూరును ముంచడం సరికాదు
X

దిశ, చారకొండ : పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అందులో భాగంగా మండల పరిధిలోని గోకారం రిజర్వాయర్ ముంపు లో భాగమైన ఎర్రవెల్లి బాధితులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకం పేరుతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం చేసే విధంగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉందని వారు తెలిపారు. గత పది సంవత్సరాలుగా ఉండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ జిల్లా రైతులు ఎన్నో ఆందోళనలు చేశారని, అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.


గ్రామ పంచాయతీ ఎన్నికలు బహిష్కరించి ,131 రోజులు గా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం సరైందికాదని వారు తెలిపారు. ప్రాజెక్టు అంశంపై ప్రకటనలు చేయడమే కాకుండా జీవో చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల కు అధికంగా నష్టపరిచే ఈ ప్రాజెక్టు ను తక్షణం రద్దుచేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి, వీర బ్రహ్మచారి ప్రముఖ న్యాయవాదులు మధుసూదన్ బాబు పరమేశ్వరి గౌడు, వెంకట్ గౌడు, కేసీ వెంకటేశ్వర్లు తిమ్మప్ప హనీఫ్ ఖలీల్ రిటైర్డ్ ఎమ్మార్వో చెన్నకిష్టయ్య, సాయిబాబా కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానంద గౌడ్, అశోక్ గౌడు, సర్పంచ్ రమేష్ గౌడు, ఆంజనేయులు గౌడు, అల్లాజీ, గోకారం రిజర్వాయర్ ముంపు బాధితులు పాల్గొన్నారు.

Next Story