- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు సబ్ కాంట్రాక్టర్ ఫిర్యాదు.. రైతు ఆత్మహత్య
తన పంటను నాశనం చేయడమే కాకుండా తనపైనే కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఓ రైతు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించాడు.

దిశ, రేవల్లి: తన పంటను నాశనం చేయడమే కాకుండా తనపైనే కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఓ రైతు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా రిజర్వాయర్ పనుల్లో భాగంగా కేఎన్ఆర్ కంపెనీ రివిట్మెంట్, రోడ్డు పనులను ఎదులకు చెందిన సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డికి అప్పగించింది. ఈ క్రమంలో మండల కేంద్రానికి చెందిన రైతు కొమ్ము ఆంజనేయులు (45) పంటను సదరు కాంట్రాక్టరు భారీ వాహనాలతో తొక్కించి నాశనం చేయించాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతుపై ప్రభుత్వ పనులు అడ్డుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స కోసం అతన్ని హైదరాబాద్ తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతని మృతదేహన్ని మండల కేంద్రంలోని ఎదులలో ప్రధాన రహదారిపై ఉంచి కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాచాల యుగంధర్ గౌడ్ రైతు బలవన్మరణం పట్ల సంఘీభావాన్నీ ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రైతు మరణానికి కారణమైన సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ రాస్తా రోకోలో పాల్గొని మద్ధతు తెలిపారు.






