విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై శివ నాగేశ్వర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మిడ్జిల్ : విద్యార్థులు ప్రాథమిక చట్టాలపై కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపారు . మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసుల సేవల

విద్యార్థి దశ నుంచే  చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై శివ నాగేశ్వర్
X

దిశ, మిడ్జిల్ : విద్యార్థులు ప్రాథమిక చట్టాలపై కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపారు . మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసుల సేవల పట్ల అవగాహన క‌ల్పించారు. మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టాలు, నేరాలు, శిక్షలు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, ఆయుధాల వినియోగం పలు అంశాలపై అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలు చేయడానికి జంకుతారని అన్నారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ సిస్టమ్, లాకప్ గది, రికార్డుల నిర్వహణ, విచారణ విధానం గురించి ఆసక్తిగా పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణ, తీసుకునే చర్యల గురించి సమగ్రంగా సిబ్బంది విద్యార్థులకు వివరించారు. పోలీస్ శాఖ పట్ల గౌరవం, బాధ్యత భావం కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల సందేహాలను పోలీసులు నివృత్తి చేశారు. విద్యార్థులకు శక్తి యాప్‌, పోక్సో యాక్ట్‌, సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులపై సెల్‌ఫోన్, సోషల్‌ మీడియా ప్రభావంపై ఆయన వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది నారాయణరెడ్డి, ఆంజనేయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story