ఎంఈవో కుర్చీకి విన‌తి పత్రాన్ని సమర్పించిన విద్యార్థి సంఘాలు

by Ratna Kumari |

అనుమతులు లేకుండా పాఠ‌శాల‌లపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థి సంఘాల నేత‌లు ఎంఈవో కుర్చికి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

ఎంఈవో కుర్చీకి  విన‌తి పత్రాన్ని సమర్పించిన విద్యార్థి సంఘాలు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అనుమతులు లేకుండా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నడుస్తున్న పాఠశాలలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మహబూబ్ నగర్ అర్బన్ ఎంఈవో లక్ష్మణ్ సింగ్ ను ప్రశ్నిస్తే లేచి వెళ్లిపోయాడని జిల్లా విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, PDSU విద్యార్ధీ సంఘాల నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు భరత్, సీతారాం, లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలో అడ్డూ అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారని, యూనిఫామ్, బుక్స్, షూస్, టైం లాంటి వాటిపై రేట్లు పెట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ఎంఈవో ను ప్రశ్నిస్తే ఆయన అదృశ్యం అయ్యాడని, విధిలేక ఆయన కుర్చీ కి మా విన‌తి పత్రాన్ని సమర్పించామని వారు తెలిపారు. వెంటనే అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్,మారుతి, రాజశేఖర్,రాజు,హేమలత పాల్గొన్నారు.

Next Story