గురుకుల హాస్టల్ నుంచి విద్యార్థి అదృశ్యం

by Ratna Kumari |

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోనీ గురుకుల ఎస్సీ బాయ్స్ హాస్టల్ నుంచి ఏస‌న్న విద్యార్థి ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా బ‌య‌టికి వెళ్లాడు.

గురుకుల హాస్టల్ నుంచి విద్యార్థి అదృశ్యం
X

దిశ‌, పెద్ద‌కొత్త‌ప‌ల్లి : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోనీ గురుకుల ఎస్సీ బాయ్స్ హాస్టల్ నుంచి శుక్రవారం రాత్రి 7:30 గంటల నుంచి కనిపించడం లేదు. ఈ విద్యార్థి ఏస‌న్న జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్ పూరం గ్రామానికి చెందిన వాడు. అదృశ్యమైన విద్యార్ధి ఏసన్న ఆచూకీ తెలిసిన వారు ఈ నంబర్లకు 7093050990, 9603307885 సమాచారం ఇవ్వాలని రెసిడెన్షియల్ గురుకుల హాస్టల్ ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story