ఉద్యోగుల సమస్యల సాధనకు పోరాటమే శరణ్యం

by Ratna Kumari |

తెలంగాణా ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా ఉద్యోగుల డిమాండ్ల పై భూత్పూరు మండల తహశీల్దార్ కిషన్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఉద్యోగుల సమస్యల సాధనకు పోరాటమే శరణ్యం
X

దిశ, భూత్పూరు : తెలంగాణా ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా ఉద్యోగుల డిమాండ్ల పై భూత్పూరు మండల తహశీల్దార్ కిషన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని స్థాయిల ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ కు ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, యూటీఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను డీఏ లను విడుదల చేయాలని, తెలంగాణ రెండో పీఆర్సీ నివేదికను తెప్పించి 51% ఫిట్ మెంట్ తో వెంటనే అమలు చేయాలని, ఈ ఎచ్ ఎస్ విధివిధానాలను రూపొందించి అమలుచేయాలన్నారు.

రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వెంటనే వారికి రావాల్సిన మొత్తాలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్లతో పాటు 64 రకాల డిమాండ్ల సాధనకు తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ దశలవారీగా ఉద్యమించనున్నదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు కృష్ణ, యాదయ్య, రేవతి, లింగం గౌడు, సాయిరాం రెడ్డి, సాయిరాం ఖాదరయ్య, వెంకట్ నారాయణ, బాల్ రెడ్డి,ఆంజనేయులు,జెట్టి రామస్వామి, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story