కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం : సీఐటీయూ

by Ratna Kumari |

కేంద్ర‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృతంగా ఎండగడతామని సీఐటీయూ, రైతు సంఘం, వ్య‌వ‌సాయ‌య కార్మిక సంఘం నాయ‌కులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం : సీఐటీయూ
X

దిశ, కందనూల్ : కేంద్ర‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృతంగా ఎండగడతామని సీఐటీయూ, రైతు సంఘం, వ్య‌వ‌సాయ‌య కార్మిక సంఘం నాయ‌కులు తెలిపారు. శుక్ర‌వారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాల‌యంలో సీఐటీయూ, వ్య‌వ‌సాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. వ్య‌వ‌సాయ కార్మిక సంఘం జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ర‌సింహ మాట్లాడుతూ న‌వంబ‌ర్ 01 నుంచి 04 లేబ‌ర్ కోడ్ల‌ను అమ‌లులోకి తెచ్చి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వ కార్మికుల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగిస్తోంద‌న్నారు. విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు-2025, ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేట్ పెట్టుబ‌డుల ప్రోత్సాహం, రైతు వ్య‌తిరేక చ‌ట్టాల అమ‌లుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు విమ‌ర్శించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా..

వామపక్షాల పోరాటంతో వ్యవసాయ కూలీలకు అందుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి, దాని స్థానంలో విబిజి రాంజీ పథకాన్ని తీసుకువచ్చి ఉపాధి హామీ పథకాన్ని రూపుమాపాలని చూస్తోందన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్. శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు విస్తృత ప్రచారం చేపడతామన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ప్రతి మండల కేంద్రంలో జీపి జాతా నిర్వహించి, ఈ నెల 19న జిల్లా కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో కలిసి ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు, ఉపాధ్యక్షులు వి.పర్వతాలు, పొదిల రామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింత ఆంజనేయులు, రైతు సంఘం నాయకుడు నరేందర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Next Story