- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
దిశ, కందనూల్ : జిల్లాలో ఇసుక తవ్వకం, రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. కలెక్టర్ ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో

దిశ, కందనూల్ : జిల్లాలో ఇసుక తవ్వకం, రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. కలెక్టర్ ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి స్యాండ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామంలోని రెండు ఇసుక రీచ్‌లపై, తాడూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని రీచ్‌లపై అధికారులు సమర్పించిన నివేదికలను కలెక్టర్ సవివరంగా పరిశీలించారు. ఇసుక రవాణా, నిల్వలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణ పనులకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారానే అనుమతించాలనీ, ఎన్ని టిప్పర్లు ఏ ప్రాంతానికి ఇసుకను తరలిస్తున్నాయో వివరాలు స్పష్టంగా నమోదు కావాలని సూచించారు. ఆన్‌లైన్ అనుమతుల ద్వారా పారదర్శకత పెరుగుతుందని, అక్రమ రవాణా తగ్గుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అక్రమ తవ్వకం, రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి టిప్పర్ కదలికపై సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇసుక వినియోగం పారదర్శకంగా సాగితే అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, నీటిపారుదల శాఖ అధికారి మురళి, భూగర్భ జల శాఖ అధికారి దివ్యజ్యోతి, టీజీఎండిసి మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.






