- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలవి వలలతో చేప పిల్లలను వేటాడితే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
దిశ, కొల్లాపూర్ : అలవి వలలతో శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో చేపపిల్లలను వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు హెచ్చరించారు. బుధవారం నాగర్ క

దిశ, కొల్లాపూర్ : అలవి వలలతో శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో చేపపిల్లలను వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు హెచ్చరించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మత్స్య శాఖ ద్వారా 100 శాతం రాయితీ పై వివిధ రకాల లక్ష చేప పిల్లలను మత్స్యశాఖ కమిషనర్ నిఖిలతో కలిసి మంత్రి జూపల్లి వదిలారు. మంత్రి గంగమ్మ తల్లికి పూలు చల్లి పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ అలవి వలలను వినియోగించడం మూలంగా మత్స్యకారులకు ఆదాయం తగ్గుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చేప పిల్లలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందిస్తున్నామని, మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
చేప పిల్లల నాణ్యత పాటించాలని, నా ణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. నదిలో చేప పిల్లల కోసం అలవి వలలను వాడడం పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. అలవి వలల మూలంగా మత్స్యకారులు, గంగపుత్రలకు ఆదాయం కోల్పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. నదిలో చేప పిల్లలు పెరిగి పెద్దగా పెరిగితే మత్స్యకారులకు బంగారు బాతు గుడ్డులా ఉంటదని మంత్రి అన్నారు. ఆంధ్ర వైపు జాలార్లు అలవి వలలు వాడితే కట్టడి చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లెటర్స్ రాయండని మంత్రి సంబందిత అధికారులను అదేశించారు. సోమశిల లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ చేపల రెస్టారెంట్ ఏర్పాటు చేసి చేపలతో వివిధ రకాల చేపల ప్రై చేస్తే పర్యాటకులు ఆసక్తిగా తీసుకుంటారని మంత్రి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు లో 65 గ్రామాలు మునకకు గురైనందున ప్రజలకు ఆధారం లేదు. కనుక చేపలు పట్టుకొని జీవనోపాధి పొందు తారన్నారు. ఎవరైనా మా పేరు చెబితే ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు. ప్రతి ఏటా చేప పిల్లలను ఎక్కడి నుంచో దిగుమతి చేసుకునే బదులు మీరు కూడా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పై రుణాలు అందించే విధంగా చూద్దామని ఆయన పేర్కొన్నారు.






