బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు : ఎస్ఐ మాధవరెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఐ మాధవరెడ్డి మండల ప్రజలకు కీలక సూచనలు శుక్రవారం చేశారు.

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు : ఎస్ఐ మాధవరెడ్డి
X

దిశ, వంగూర్ : ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఐ మాధవరెడ్డి మండల ప్రజలకు కీలక సూచనలు శుక్రవారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, బాల కార్మిక నిషేధ చట్టం-2016 ప్రకారం కఠిన శిక్షలు విధించబడతాయని హెచ్చరించారు.14 సంవత్సరాల లోపు పిల్లలను ఎలాంటి పనుల్లోనూ నియమించ రాదని, పిల్లల విద్యాభ్యాసానికి ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించవ ద్దని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. బాల కార్మిక నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. హోటళ్లు, దుకాణాలు, వర్క్‌షాపులు, ఇతర వ్యాపార సంస్థల్లో చిన్నారులను పనిలో పెట్టుకోకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం వారిని పాఠశాలలకు పంపించి విద్యను అందించాలని, బాలల హక్కుల పరిరక్షణకు ప్రజలు సహకరిం చాలని ఎస్ఐ మాధవరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story