అధిక ధరలకు యూరియా అమ్మితే కఠిన చర్యలు

by velandi.Saikiran |

అధిక ధరలకు యూరియా అమ్మితే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు నాగర్‌కర్నూల్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పూర్ణచందర్ రెడ్డి.

అధిక ధరలకు యూరియా అమ్మితే కఠిన చర్యలు
X

దిశ, బిజినేపల్లి: అధిక ధరలకు యూరియా అమ్మితే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు నాగర్‌కర్నూల్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పూర్ణచందర్ రెడ్డి. బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి రెండు ఎరువుల దుకాణాల లైసెన్సులను రద్దు (Suspend) చేసినట్లు పూర్ణచందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

లట్టుపల్లి గ్రామంలోని "అన్నదాత ట్రేడర్స్" (Annadatha Traders), "రైతుమిత్ర ఫెర్టిలైజర్స్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్" (Raithu mithra fertilizers, seeds and pesticides) దుకాణాల యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు సదరు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘన నిజమేనని నిర్ధారించారు. ఎరువుల నియంత్రణ చట్టం (Fertilizer Control Order) ప్రకారం ఈ రెండు దుకాణాల విక్రయ లైసెన్సులను తక్షణమే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story