పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

by Ratna Kumari |   (  Updated:2025-12-05 14:20:29  IST  )

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, పోలేపల్లి గ్రామంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఐమాక్స్ లైట్లు, వీధి దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండడంతో

పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
X

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, పోలేపల్లి గ్రామంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఐమాక్స్ లైట్లు, వీధి దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండడంతో కరెంటు బిల్లులు భారీగా మోత‌ పడుతున్నాయని ఆ గ్రామ ప్రజలు విన్నవించారు. గ్రామంలో రాత్రి సమయంలో వెలగాల్సిన వీధిలైట్లు ఐమాక్స్ లైట్లు ఎప్పుడు వెలుగుతూనే ఉండడంతో గ్రామానికి వచ్చిన ఆదాయం మొత్తం కరెంటు బిల్లుల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామ ప్రజలు వాపోయారు. గ్రామ సెక్రెటరీ గ్రామానికి వచ్చేది 10 గంటలకు లంచ్ కు మండల కార్యాలయానికి వెళ్లడంతో గ్రామ సమస్యలు పట్టించుకోకుండా నిర్ల‌క్ష్య‌పు నీడలో ఉండటంతో గ్రామాన్ని పట్టించుకోకపోవడంతోనే లైట్లు నిరంతరం వెలుగుతున్నాయని దీంతో పాటు డ్రైనేజీలు అస్తవ్యస్తంగానే ఉన్నాయని గ్రామస్తులు విన్నవించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లైట్లు రాత్రి సమయంలోనే వెలిగే విధంగా చూడాలని కోరుతున్నారు.

Next Story