- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్టీఓ రామ్మోహన్ మృతి
దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణవాసి రిటైర్డ్ ఎస్టీఓ రాంమోహన్ (80)వృద్దాప్యం తో ఆదివారం హైదరాబాద్ లో తన కూతురి నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణవాసి రిటైర్డ్ ఎస్టీఓ రాంమోహన్ (80)వృద్దాప్యం తో ఆదివారం హైదరాబాద్ లో తన కూతురి నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈయనంటే తెలియని వారుండక పోవచ్చు. ఉద్యోగ నిర్వహణలో ఎవరినీ నొప్పించకుండా విధి నిర్వహణ కొనసాగించిన గొప్ప వ్యక్తి. ఈయన డిస్ట్రిక్ట్ ట్రెసర్ ఆఫీసర్ ( డీటీ ఓ )గా పదవీ విరమణ చేసినా డబ్బు కోసం ఎప్పుడూ ఎలాంటి కక్కుర్తి పడిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. రామ్మోహన్ కొల్లాపూర్ లో సబ్ ట్రెసరీ ఆఫీసర్ గా పని చేసిన, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసినా ఎందరికో ఉద్యోగులకు, పెన్షనర్స్ కు ఏదో ఒక విధంగా సహకరించేవారు. చాలా మంది ఉద్యోగులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ సౌకర్యం లేక అగమ్య గోచరంగా జీవితాన్ని కొనసాగించిన వారికి ఎందరెందరికో ఎలాంటి ప్రతిఫలం, లాభాపేక్ష ఆశించకుండా పెన్షన్ సౌకర్యం కల్పించేవారు. గొప్ప వ్యక్తిత్వం తో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్త అని కొల్లాపూర్ పట్టణ ఉద్యోగులు చెబుతున్నారు. రాంమోహన్ మరణం చాలా బాధాకరమని, ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రంగినేని మహేందర్, కొల్లాపూర్ తాలూకా నాల్గొవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు జీ కే వెంకటేష్, గోవింద్ రెడ్డి, సురేందర్ కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.






