ముంపు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండ : మంత్రి జూపల్లి

by Chintha Aamani |

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ లో ముగింపునకు గురవుతున్న

ముంపు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం  అండ : మంత్రి జూపల్లి
X

దిశ, కొల్లాపూర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ లో ముగింపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు తోడు ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

సోమవారం సాయంత్రం కొల్లాపూర్ లో మంత్రి క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, రెవెన్యూ, సాగునీటిపారుదల అధికారులు ముంపుకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల తో పునరావాసం, ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణాలు, తదితర అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్వాసితులకు పునరావాసమే మా ప్రథమ ప్రాధాన్యతని, ప్రభుత్వం వారి జీవితంలో కొత్త వెలుగులతో ప్రారంభించేలా పూర్తిగా అండగా నిలుస్తుందని మంత్రి అన్నారు.

పునరావాస కాలనీల్లో వసతి, నీరు, విద్యుత్, రహదారి, ఉపాధి, ఆరోగ్య సేవలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు పునరావాస కాలనీల్లో పనుల పురోగతి, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై నివేదికలను మంత్రికి సమర్పించారు.

ప్రాజెక్టులు సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, తదితర అనుమతులకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుండి అందాల్సిన పరిహారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు అంశాల వారీగా మంత్రి ఆదేశాలకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, ముంపు గ్రామాల ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి చేయాలని కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్, పాలమూరు రంగారెడ్డి ప్రత్యేక భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖల అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story