హైవే నిర్మాణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా ఉంది : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

హైవే నిర్మాణంలో కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా కూడా ఉంద‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి తెలిపారు.

హైవే నిర్మాణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా ఉంది :  మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌క‌టించిన ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో గూడెబ‌ల్లూర్ నుంచి జ‌డ్చ‌ర్ల వ‌ర‌కు దాదాపు 80 కిలోమీట్ల వ‌ర‌కు రోడ్డు ప‌నుల‌కు నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఈ ప‌నులు త్వ‌ర‌లోనే ప్రారంభిచ‌నున్న‌ట్టు మంత్రి వాకిటి శ్రీహ‌రి తెలిపారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మ‌క్త‌ల్ నుంచి నారాయ‌ణ‌పేటకు రూ.200 కోట్ల‌తో 30 కిలోమీట‌ర్ల రోడ్డుకు మంజూరు కావ‌డంతో మ‌క్త‌ల్-నారాయ‌ణ‌పేట్-కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 38వేలు, నారాయ‌ణ‌పేట‌లో 42వేలు, కొడంగ‌ల్ 48 వేల‌ ఎక‌రాలు భూమి సాగుబ‌డుల‌కు రావ‌డం అందుకు ప్ర‌భుత్వం రూ. 4500 కోట్ల‌తో ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభం కావ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ ప‌నుల‌న్నింటిని హైబ్రిడ్ యాన్యుటిమోడ్ ప‌ద్ద‌తిలో చేయ‌డం.. ఇందులో కేంద్రం 60 శాతం ఖ‌ర్చు, రాష్ట్ర ప్ర‌భుత్వం 40 శాతం వ‌ర‌కు భ‌రిస్తాయి. ఈ విధానంలో ముఖ్యంగా 10 కిలోమీట‌ర్ల కంటే ఎక్కువ పొడ‌వు ఉన్న రోడ్ల‌ను డ‌బుల్ వే, ఫోర్ వేలుగా మారుస్తున్నారు. మ‌క్త‌ల్-నారాయ‌ణ‌పేట రోడ్డు ప‌నులు జ‌రుగుతాయ‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి తెలిపారు. నాణ్య‌మైన రోడ్ల నిర్మాణం, భూసేక‌ర‌ణ ఇబ్బందులు లేకుండా చేయ‌డం కాంట్రాక్ట‌ర్ ప‌నులు పూర్తి చేసిన ఏజెన్సీలే 5 నుంచి 10 సంవ‌త్స‌రాల పాటు వాటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త తీసుకుంటారు. ప్ర‌స్తుతం కొన్ని ఏజెన్సీలు ముందుకు రాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం బ్యాంకు గ్యారెంటీల‌తో ప‌నులు వేగ‌వంతం చేస్తోంది. ఈ ప‌ద్ద‌తిలో తెలంగాణ‌లో ప‌ల్లెల‌కు కూడా తారు రోడ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

Next Story