పీపీసీ సెంటర్లను రేపటిలోగా ప్రారంభించండి

by Ratna Kumari |

దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్/గండీడ్/హన్వాడ : మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం తీర్మానించిన నేపథ్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శనివారం హన్వాడ,

పీపీసీ సెంటర్లను రేపటిలోగా ప్రారంభించండి
X

దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్/గండీడ్/హన్వాడ : మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం తీర్మానించిన నేపథ్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శనివారం హన్వాడ, మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో సీఎంఆర్ డెలివరీ 96 శాతం పూర్తయింద‌ని మిగిలిన 4% త్వరగా పూర్తి చేయాలని సంబంధిత రైస్ మిల్లర్లను ఆదేశించారు. మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ఏపీఎం సిబ్బందితో మాట్లాడారు.ఇంకా పనిచేయని పీపీసీ సెంటర్లు రేపటికి తప్పనిసరిగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మిగిలి ఉన్న సీఎంఆర్ కు సంబంధించిన ఐదు రైస్ మిల్లు లను —1.లక్ష్మీబాలాజీ 2.షిర్డీసాయి3.లక్ష్మీవెంకటేశ్వర4. మంజునాథ 5. శ్రీ రామ (హన్వాడ, మండలం) తనిఖీ చేసి 24 గంటలు మిల్లులు నడిపి డెలివరీ పూర్తి చేయాలని ఆదేశించారు.


విధుల్లో నిర్లక్ష్యం కనబరిస్తే ఖరీఫ్ 2025–26లో వారికీ వరి అలాట్మెంట్ ఇవ్వబోమని డిసిఎస్వో, డిఎంసిఎస్ లకు సూచనలు జారీ చేశారు. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆదిత్య గౌడ్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. తదుపరి గండీడ్ మండలం కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించి, ఇటీవల గుర్తించిన సమస్యల పరిష్కారం పై నివేదిక తీసుకున్నారు. ఇంకుడు గుంత పనులు త్వరగా పూర్తి చేయాలని, సీసీ కెమెరాల పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు. విద్యార్థినులు వేసిన చిత్రాలను పరిశీలించి వారిని అభినందించారు. వేపూర్ గ్రామంలో ఎఫ్ పి షాప్ నెంబర్–14 తనిఖీలో డీలర్‌కు ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ లేకపోవడం,బోర్డు సరిగా లేకపోవడం పై తక్షణ చర్యలు తీసుకోవాలని, షోకాస్ నోటీసు జారీ చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ పంపిణీ అవుతున్న బియ్యం నాణ్యత గురించి తెలుసుకున్నారు.

Next Story