- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమనీయం.. అపర భద్రాద్రి రాములోరి కళ్యాణం
సిర్శనగండ్ల శ్రీ సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. కన్నుల పండువగా సాగిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగితేలారు.

దిశ, చారకొండ : సిర్శనగండ్ల శ్రీ సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. కన్నుల పండువగా సాగిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి పచ్చని తోరణాలు, పందిళ్ళు నడుమ కల్యాణ మండపాన్ని అత్యంత సుందరంగా పూలమాలలతో అలంకరించారు. ఆలయ అర్చకులు విశేష పూజలు, మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. శ్రీ రామ నవమి సందర్భంగా అయోధ్య నగర్, ఆలయ పరిసరాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కూడు వంశీ కృష్ణ దంపతులు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు వ్యాపార సంస్థలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై వీరబాబు, పోలీసు సిబ్బంది స్థానిక సంస్థల, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.






