కొద్ది గంట‌ల్లోనే క్రీడ‌లు ప్రారంభం.. ఏర్పాట్ల‌పై మంత్రి ఆరా..!

by Ratna Kumari |

కొద్ది గంట‌ల్లోనే రాష్ట్ర క‌బ‌డ్డీ పోటీల‌ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ‌రి ప్రారంభించ‌నున్నారు. అయితే అక్క‌డ ఏర్పాట్ల పై మంత్రి ఆరా తీశారు.

కొద్ది గంట‌ల్లోనే క్రీడ‌లు ప్రారంభం.. ఏర్పాట్ల‌పై మంత్రి ఆరా..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : కొద్ది గంట‌ల్లోనే రాష్ట్ర క‌బ‌డ్డీ పోటీల‌ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ‌రి ప్రారంభించ‌నున్నారు. అయితే అక్క‌డ ఏర్పాట్ల పై మంత్రి ఆరా తీశారు. స్టేడియంలో ఫొటోలు ఉంచాల్సిన ప్రాధాన్య‌త పై అక్క‌డ నిర్వాహ‌కుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌తో సంభాషించ‌డం.. వారికి క‌ల్పించిన ఏర్పాట్ల పై మంత్రి ఆరా తీశారు. ఎక్క‌డ వాడి ప‌డేసిన వ‌స్తువులు, ప్లాస్టిక్ వ‌స్తువులు ప్లాస్టిక్, కాళీ వాట‌ర్ డ‌బ్బాలు కాగితాలు టీ క‌ప్పులు నిషేదిత బ‌స్సులు ఎక్క‌డ కూడా గ్రౌండ్ లో క‌నిపించ‌కూడ‌ద‌ని.. పారిశుధ్య కార్మికుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడూ శుభ్రం చేయించాల‌ని క‌మిష‌న‌ర్ తో మంత్రి ఆదేశించారు. రాష్ట్ర న‌లుమూలల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌కు మ‌క్త‌ల్ వేదిక‌గా క‌ల్పించే సౌక‌ర్యాలు ఆద‌ర‌ణ మ‌క్త‌ల్ కు నిర్వాహ‌కుల‌కు పేరు తెస్తుంద‌ని అందులో ఎక్కడా చిన్న పొర‌పాట్లు చేయ‌రాద‌ని ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారుల‌ను ఆదేశించారు మంత్రి వాకిటి శ్రీహ‌రి.

Next Story