- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడలు పట్టుదలను పెంచుతాయి: ఎస్పీ నరసింహ
by Taduka Kalyani |
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు విజయం సాధించాలనే పట్టుదలనూ పెంచుతాయని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు.

X
దిశ, మహబూబ్ నగర్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు విజయం సాధించాలనే పట్టుదలనూ పెంచుతాయని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఆయన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ -2023 ని ప్రారంభిస్తూ ప్రసంగించారు. ఉద్యోగికి ఆరోగ్యకరమైన పని వాతావరణానికి, మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
క్రీడల వలన ఆరోగ్యమే కాకుండా పనిలో ఉత్పాదకతను కూడా మెరుగు పరుస్తుందని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో అడిషపల్ ఎస్పీ రాములు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు మహేష్, రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ, రిజర్వు సీఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐ లు పాల్గొన్నారు.
Next Story






