- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త పెన్షన్లపై ‘సోషల్’ గందరగోళం
కొత్త పింఛన్ల దరఖాస్తుల విషయంలో కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారంతో సామాన్య ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

కొత్త పెన్షన్లపై ‘సోషల్’ గందరగోళం..
- దరఖాస్తులు తీసుకునే తేదీలు వైరల్
- ఎండలో వృద్ధులు, వికలాంగుల అవస్థలు..
- క్లారిటీ ఇచ్చిన డీఆర్డీఓ!
-మార్గదర్శకాలు రాలేదు.. పుకార్లను నమ్మవద్దు: పీడీ శ్రీనివాస్
దిశ, కొడంగల్: రాష్ట్రంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల విషయంలో కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారంతో సామాన్య ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్త ర్వులు అందలేదని, సోషల్ మీడి యాలో వస్తున్న తేదీలను చూసి ఆందోళన చెందవద్దని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
కమిషనర్ సమీక్ష.. ప్రచారాల హోరు!
ఇటీవల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శా ఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త పెన్షన్లకు సంబం ధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయని, అందుకు అధి కార యంత్రాంగం సిద్ధంగా ఉం డాలని ఆమె సూచించారు. అయి తే, ఈ అంతర్గత సమావేశాన్ని సా కుగా తీసుకుని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెరలేపారు.
వైరల్ పోస్టులతో పేదల పాట్లు!
అధికారుల స్థాయిలో కసరత్తు జరుగుతుండగానే.. ‘మే 22 నుంచి 25, 30 వరకు’ దరఖాస్తులు స్వీకరిస్తారంటూ తేదీలతో కూడిన పోస్ట ర్లు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని నమ్మి వృద్ధులు, దివ్యాంగులు జిరా క్స్ సెంటర్ల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇ బ్బందులు పడుతున్నారు.
షెడ్యూల్ ఖరారు కాలేదు: పీడీ
ఈ అంశంపై వికారాబాద్ జిల్లా డీఆర్డీఓ శ్రీనివాస్‌ను 'దిశ' వివరణ కోరగా.. ఆయన స్పష్టత ఇచ్చారు. కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభు త్వం నుంచి ఇంకా ఎలాంటి జీవో లేదా మార్గదర్శకాలు రాలేదని తెలి పారు. దరఖాస్తుల స్వీకరణకు సం బంధించి ఎలాంటి షెడ్యూల్ గానీ, తేదీలు గానీ ఖరారు కాలేదని ఆయ న స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందగానే ఆ సమాచారాన్ని అధికారికంగా మీడియా ద్వారా వెల్లడిస్తామని డీఆర్డీఓ పేర్కొన్నారు. అప్పటివరకు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అనాధికారిక ప్రచారాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు.






