- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఓటర్ల మ్యాపింగ్, ఇంటింటి పరిశీలన, ప్రోజెనీ(సంతతి)సర్వేలను రాబోయే రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి బూత్ లెవెల్ ఆఫీసర్ల ను ఆదేశించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఓటర్ల మ్యాపింగ్, ఇంటింటి పరిశీలన, ప్రోజెనీ(సంతతి)సర్వేలను రాబోయే రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి బూత్ లెవెల్ ఆఫీసర్ల ను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బీఎల్ఓ లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీఎల్‌వో ల పనితీరు 25 శాతం కంటే తక్కువగా ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో నమోదైన ఓటర్లు ప్రస్తుతం కొనసాగుతున్నారా లేదా వారి వివరాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఈ మ్యాపింగ్ పనులు రాబోయే రెండు మూడు రోజుల్లో కనీసం 80 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రోజెనీ సర్వేను కూడా నిర్వహించి 75 శాతం పనిని రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఇది ప్రాథమిక సన్నాహక ప్రక్రియగా ఆమె వివరించారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈ పనిని అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, బీఎల్‌వో లు రాబోయే రెండు మూడు రోజుల్లో 80 శాతం మ్యాపింగ్ పూర్తి చేసేలా సంబంధిత సూపర్వైజర్లు, తహసీల్దార్లు,ఇతర సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ నవీన్, డిఎంహెచ్ఓ డా.కృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి జరీనా బేగం, అధికారులు పాల్గొన్నారు.






