- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోం గార్డ్స్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
జిల్లా పోలీస్ శాఖ లోని హోం గార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేకంగా దృష్టి సారించామని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.

హోం గార్డ్స్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
-జిల్లా ఎస్పీ జానకి
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: జిల్లా పోలీస్ శాఖ లోని హోం గార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేకంగా దృష్టి సారించామని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ విభాగంలోని హోంగార్డ్ ఆఫీసర్లకు రెయిన్ కోట్లు పంపిణీ చేసి మాట్లాడారు. హోంగార్డులు జిల్లా పోలీస్ విభాగంలో ఒక కీలక భాగమని, ప్రజా భద్రత కోసం వారు ఎండ, వాన, పండుగలు, ప్రత్యేక బందోబస్తు సందర్భాల్లోనూ నిరంతరం సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అలాగే హోంగార్డుల సౌకర్యాలు, భద్రత, భవిష్యత్తు కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, అవసరమైన సదుపాయాలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. హోంగార్డులు ధైర్యంగా, నిబద్ధతతో పని చేస్తేనే పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ కృష్ణయ్య, హోం గార్డ్స్ ఆర్‌ఐ నగేష్ పాల్గొన్నారు.






