నారాయణపేట జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం : ఎస్పీ వినీత్

by Ratna Kumari |

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : నారాయణపేట జిల్లా పరిధిలో చైనా మాంజా పై నిషేధం విధించిన‌ట్టు

నారాయణపేట జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం : ఎస్పీ వినీత్
X

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : నారాయణపేట జిల్లా పరిధిలో చైనా మాంజా పై నిషేధం విధించిన‌ట్టు ఎస్పీ వినీత్ తెలిపారు. తాజాగా ఆయ‌న దిశ‌తో మాట్లాడుతూ.. జిల్లా లో ఎవరైనా చైనా మాంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. రాబోయే సంక్రాంతి పండగ సంద‌ర్భంగా చైనా మాంజా ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాల పై అధికారులు తనిఖీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. నైలాన్, సింథటిక్‌ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో పర్యవరణానికి విపత్తుగా మారడంతో దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన‌ట్టు తెలిపారు. చైనా మాంజ‌ను ఉప‌యోగించి గాలి ప‌టాలు ఎగుర‌వేసే క్రమంలో ఎన్నో ప‌క్షులు, సాధారణ ప్రజలు కూడా ప్ర‌మాదానికి గురవుతారు. ఈ నేప‌థ్యంలో చైనా మంజా నిషేదించామ‌ని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా చైనా మాంజా పై నిషేధం విధించిన‌ట్టు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం.. కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వెంట‌నే డయల్‌ 100 కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలను కోరారు.

Next Story