- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > దిశ ఎఫెక్ట్.. కర్ణాటక బార్డర్ కృష్ణ వద్ద శాశ్వత ఏర్పాటుకు ఎస్పీ ఆదేశం..!
దిశ ఎఫెక్ట్.. కర్ణాటక బార్డర్ కృష్ణ వద్ద శాశ్వత ఏర్పాటుకు ఎస్పీ ఆదేశం..!
దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి. వినీత్ తక్షణమే నారాయణపేట జిల్లా బార్డర్ పోలీస్ స్టేషన్ లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ముందుగానే

X
దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి. వినీత్ తక్షణమే నారాయణపేట జిల్లా బార్డర్ పోలీస్ స్టేషన్ లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ముందుగానే నారాయణపేట జిల్లా కర్ణాటక బార్డర్ కు సమీపంలో ఉన్నందున అక్రమ రవాణా కట్టడికి చర్యలు చేపట్టాలని దిశ ప్రచురించింది. ఈ మేరకు ఎస్పీ బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాశ్వత చెక్పోస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా కృష్ణ బార్డర్ వద్ద ఇదివరకే ఆర్టిఏ, కర్ణాటక తెలంగాణ పోలీసుల సమన్వయంతో చెక్ పోస్ట్ కొనసాగుతుంది. ఇవి కాకుండా ఎస్పీ వినీత్ ప్రత్యేకంగా మరొక చెక్పోస్ట్ ను శాశ్వతంగా ఏర్పాటు చేయించేలా చొరవ తీసుకున్నారు. ఎస్పీ నిర్ణయం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






