అన్నిరంగాల్లో మహిళలు ఉన్నతంగా ఎదగాలి : ఎస్పీ జానకి

by Ratna Kumari |

నేటి మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని ఎస్పీ జానకి ఆకాంక్షించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు.

అన్నిరంగాల్లో మహిళలు ఉన్నతంగా ఎదగాలి :  ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నేటి మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని ఎస్పీ జానకి ఆకాంక్షించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. మహిళలకు గౌరవం, సమాన హక్కులు అవకాశాలు లభించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధిని సాధించగలదని అన్నారు. నేటి మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు, రాజకీయాలు వంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను నిరూపిస్తూ సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని,తమ ఆత్మవిశ్వాసం, పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగితే దేశ అభివృద్ధిలో మరింత భాగస్వాములు అవుతారని అన్నారు.

మహిళల భద్రత, రక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని,మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మహిళల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో షీ టీమ్స్, కళాజాత బృందాల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు తమ హక్కులు, చట్టాలు, భద్రతకు సంబంధించిన సేవలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు సాగుతూ తన లక్ష్యాలను సాధించాలని ఎస్పీ జానకి పిలుపునిచ్చారు.

Next Story