నూత‌న సంవ‌త్స‌రం వేళ‌.. ఆంక్షల హద్దు దాటితే కటకటాలే

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: న్యూ ఇయర్ వేడుకలు చేసుకుందామని ఆంక్షల హద్దు దాటితే కటకటాల పాలవుతారని ఎస్పీ జానకి హెచ్చరించారు.

నూత‌న సంవ‌త్స‌రం వేళ‌..  ఆంక్షల హద్దు దాటితే కటకటాలే
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: న్యూ ఇయర్ వేడుకలు చేసుకుందామని ఆంక్షల హద్దు దాటితే కటకటాల పాలవుతారని ఎస్పీ జానకి హెచ్చరించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమె 'దిశ' తో మాట్లాడుతూ, నూతన సంవత్సరం ఖుషీగా జరుపుకోవడానికి కొంతమంది యువతీయువకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అటువంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల అమూల్యమైన ప్రాణ నష్టం జరిగి వారి కుటుంబాలు ఘెస పడతాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పోలీస్ బృందాలతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చెపట్టనున్నట్లు ఆమె తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానానికి పంపుతామని, వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా సహకరించాలని ఎస్పీ జానకి విజ్ఞప్తి చేశారు.

ఆలయాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు...

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి, జిల్లాలో వివిధ ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు.

Next Story