ఎస్పీ జానకి కి సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర 2013 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఎస్పీ జానకి కి సెలెక్షన్ గ్రేడ్ పదోన్నతి లభించింది.

ఎస్పీ జానకి కి సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర 2013 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఎస్పీ జానకి కి సెలెక్షన్ గ్రేడ్ పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా పోలీస్ శాఖ ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, ఛేదించిన కేసులు, దర్యాప్తు లలో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఇంతవరకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లో పని చేస్తున్న ఆమె కు సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి లభించింది. సెలక్షన్ గ్రేడ్ హోదాలో గురువారం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా పోలీస్ యంత్రాంగం ఆమె ను అభినందనలతో ముంచెత్తారు.

త్వరలో డీఐజీ గా పదోన్నతి పొందాలి

సెలక్షన్ గ్రేడ్ గా పదోన్నతి పొందిన ఎస్పీ జానకి రాబోయే కాలంలో డీఐజీ గా పదోన్నతి లభించాలని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ జానకి ని కలిసి పదోన్నతి లభించినందుకు పూలబొక్కెతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, బుచ్చన్న పాల్గొన్నారు.

Next Story