- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ కమిషనర్‌గా తహసీల్దార్ కుమారుడు
by Ratna Kumari |
దిశ, గద్వాల క్రైమ్ / అలంపూర్ : వనపర్తి జిల్లా, అలంపూర్ మండలం, లింగన్‌వాయి గ్రామానికి చెందిన తహసీల్దార్ ఎస్. వరలక్ష్మి, భర్త సగినాల

X
దిశ, గద్వాల క్రైమ్ / అలంపూర్ : వనపర్తి జిల్లా, అలంపూర్ మండలం, లింగన్‌వాయి గ్రామానికి చెందిన తహసీల్దార్ ఎస్. వరలక్ష్మి, భర్త సగినాల శివశంకర్ కుమారుడు సగినల సందీప్ గత సంవత్సరంలో జరిగిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి గ్రేడ్-II మున్సిపల్ కమిషనర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘన విజయానికి వెనుక కుటుంబం నిరంతర మద్దతు అందించింది. తహసీల్దార్ ఎస్. వరలక్ష్మి, వీపంగండ్ల మండలం తహసీల్దార్‌గా ప్రజా సేవలో కట్టుబడి పనిచేసి కుమారుడికి మార్గదర్శకత్వం కల్పించారు.ఈ సందర్భంలో జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణను సందీప్ కలిశారు. అడిషనల్ కలెక్టర్ అతనికి శుభాభినందనలు తెలియజేశారు. స్థానికులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు
Next Story






