బీసీ రిజ‌ర్వేష‌న్ల పై కొన్ని పార్టీలు క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నాయి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

by Ratna Kumari |

దిశ‌, అచ్చంపేట‌ : బీసీ రిజ‌ర్వేష‌న్ల పై కొన్ని పార్టీలు క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నాయని అచ్చంపేట‌ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. బీసీ జేఏసీ బంద్ లో భాగంగా

బీసీ రిజ‌ర్వేష‌న్ల పై కొన్ని పార్టీలు క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నాయి: ఎమ్మెల్యే వంశీకృష్ణ
X

దిశ‌, అచ్చంపేట‌ : బీసీ రిజ‌ర్వేష‌న్ల పై కొన్ని పార్టీలు క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నాయని అచ్చంపేట‌ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. బీసీ జేఏసీ బంద్ లో భాగంగా ఆయ‌న పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా కొన్ని పార్టీలు రాష్ట్రంలో సై అని.. ఢిల్లీలో మాత్రం నై అంటున్నాయ‌ని తెలిపారు. రాజకీయా ఎన్నికల వరకు రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ 42% సహకరించకుంటే రేపు గ్రామాల్లో బీసీల ఓట్లు ఎలా అడుగుతారని హెచ్చరించారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.. లేకుంటే తెలంగాణలో బీజేపీ కనుమరుగై పోతుందన్నారు. జస్టిస్ పేరుతో బీసీ సమాజం హక్కుల కోసం, సామాజిక న్యాయం సాధన కోసం చేస్తున్న ఈ బంద్ చారిత్రాత్మక పోరాటం అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకట్ట వేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు. బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు.. దేశం మొత్తానికీ బహిర్గతమైంది. ప్రజల హక్కులను అడ్డుకోవడం, సామాజిక న్యాయాన్ని నిరాకరించడం వారి అలవాటు అన్నారు. ఈ బంద్ కేవలం బీసీల కోసం మాత్రమే కాదు... న్యాయం, సమానత్వం కోసం ప్రతి పౌరుడు ముందుకొచ్చారన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లును పాస్ చేయాలని లేకుంటే బీసీలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు.

Next Story