సామాజిక సమస్యలపై పోరాడుతూనే పరిష్కరించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

by Ratna Kumari |

దిశ, నారాయణపేట ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సమస్యలపై పోరాడుతూ వాటిని పరిష్కరించుకోవాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. నారాయణపేట జిల్లా

సామాజిక సమస్యలపై పోరాడుతూనే పరిష్కరించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సమస్యలపై పోరాడుతూ వాటిని పరిష్కరించుకోవాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పిడిఎస్ యూ జిల్లా తృతీయ మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జిల్లా కేంద్రంలో కళాశాలల విద్యార్థులచే భారీ ర్యాలీని మెట్రో ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి గుమ్మడి నరసయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో విద్యా వైద్య రంగాలను పాలకులు ప్రైవేట్ కు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల మధ్యతరగతి వారికి విద్యా వైద్యం అందడం లేదన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూనే తల్లి దండ్రులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై విద్యార్థులు పోరాడాలన్నారు. పంట గిట్టుబాటు, స్త్రీ పురుష సమానత్వం, కుల మత తారతమ్యాల వంటి వాటిపై కూడా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఎం. హన్మేష్, పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వి, జిల్లా అధ్యక్షులు సాయికుమార్, మాస్ లైన్ పేట డివిజన్ కార్యదర్శి కె.కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story