బీఆర్ఎస్‌కు 'సోషల్ మీడియా వారియర్' షాక్

by Ratna Kumari |

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో పార్టీ గొంతుకగా, 'సోషల్ మీడియా వారియర్'గా గుర్తింపు పొందిన వరద భాస్కర్ ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియా వారియర్ షాక్
X

దిశ - మహబూబ్ నగర్ : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో పార్టీ గొంతుకగా, 'సోషల్ మీడియా వారియర్'గా గుర్తింపు పొందిన వరద భాస్కర్ ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్‌లో చేరిన ఆయన, తక్కువ కాలంలోనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అనుచరులలో ఒకరిగా ఎదిగారు. ప్రభుత్వ విధానాలను మరియు ప్రతిపక్షాల విమర్శలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో వరద భాస్కర్ క్రియాశీలక పాత్ర పోషించారు. నిత్యం వార్తల్లో ఉంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఆయన, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన వరద భాస్కర్‌కు, కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుండి పోటీ చేసే అవకాశం దక్కలేదని సమాచారం. పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు మరియు అవకాశం లభించలేదనే అసంతృప్తితోనే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రాజీనామా మున్సిపల్ ఎన్నికల ముంగిట బిఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తదుపరి అడుగు ఎటువైపు పడుతుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story