ప్రభుత్వ పాఠశాలలో పాము క‌ల‌క‌లం..!

by Ratna Kumari |

చార‌కొండ మండ‌ల ప‌రిధిలోని రామ‌చంద్రాపురం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో పాము క‌ల‌క‌లం సృష్టించింది.

ప్రభుత్వ పాఠశాలలో పాము క‌ల‌క‌లం..!
X

దిశ, చారకొండ : చారకొండ మండల పరిధిలోని రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరింది. దీంతో పాఠ‌శాల‌లో స‌రైన ప్ర‌హ‌రీ లేక‌పోవ‌డం వ‌ల్ల నిత్యం పాములు,ఇతర జంతువులు పాఠశాల ఆవరణంలోకి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మ‌రోవైపు పాఠశాల ఊరికి చివరన ఉండ‌డం.. స‌మీపంలో వ్యవసాయ పొలాలు ఉండడంతో నిత్యం పాములు సంచ‌రిస్తున్నాయ‌ని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విద్యార్థుల మధ్యకు ఓ పాము రావడంతో స్థానికులు ఆ పామును చంపేశారు. సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి నూతన పాఠశాల భవనం, ప్రవారీ గోడ నిర్మించాలనీ గ్రామస్తులు కోరుతున్నారు. రామ‌చంద్రాపురం పాఠ‌శాల‌లో పాములు సంచ‌రిస్తున్నాయ‌ని ఎంఈఓ ఝాన్సీ రాణిని దిశ ప్ర‌తినిధి సంప్ర‌దించ‌గా.. పాఠ‌శాల భ‌వ‌నం ఊరుకు చివ‌ర‌గా ఉండటంతో పాటు.. పంట పొలాలు ద‌గ్గ‌ర ఉండ‌టం వ‌ల్ల పాములు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్తామ‌ని తెలిపారు.

Next Story