SLBC: రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం.. టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-09 07:08:47  IST  )

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC Tunnel)లో గల్లంతైన కార్మికుల జాడ కోసం 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ (Rescue operation) నిర్విరామంగా కొనసాగుతోంది.

SLBC: రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం.. టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC Tunnel)లో గల్లంతైన కార్మికుల జాడ కోసం 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ (Rescue operation) నిర్విరామంగా కొనసాగుతోంది. జీపీఆర్‌ (GPR), కేరళ నుంచి వచ్చిన కేడవర్ డాగ్స్ (Cadaver Dogs) గుర్తించిన ప్రదేశాల్లో కూలీల ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. టీబీఎం (TBM)కు ఎడమ వైపు ఓ మృతదేహానికి సంబంధించి కుడి చేయి, ఎడమ కాలును రెస్క్యూ టీమ్ గుర్తించింది. అయితే, ఆ డెడ్‌బాడీ పూర్తిగా టీబీఎంలోని కాంక్రీట్‌లో కూరుకుపోయింది. చేతికి ఉన్న కడియాన్ని బట్టి ఆ బాడీ ఇంజనీర్ గురుప్రీత్ సింగ్‌గా అధికారులు నిర్ధారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని వెలికితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం టీబీఎం (TBM)‌లో ఇరుక్కుపోయిన డెడ్‌‌బాడీని కట్టర్ల ద్వారా కట్ చేసి.. గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని డ్రిల్లింగ్ ద్వారా బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేటి రెస్క్యూ ఆపరేషన్‌లో సుమారు 130 మంది ప్రత్యక్షంగా పాల్గొంటుండగా అధికారులు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story