- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులు అరెస్ట్
నాగర్ కర్నూలు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు కల్వకుర్తి డివిజన్ డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

దిశ, కల్వకుర్తి : నాగర్ కర్నూలు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు కల్వకుర్తి డివిజన్ డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి వివరాలను వెల్లడించారు. వంగూరు మండలానికి చెందిన 3 గురు, వెల్దండ మండలానికి చెందిన 3 గురు సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో తాళం వేసిన ఇళ్ళల్లో, ఒంటరి మహిళల పై బంగారు ఆభరణాలు, నగదు దోచుకోవడమే నేరవృత్తిగా ఎంచుకొని పలు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డారు. ఈ 6 గురిలో ఒకరికి గత నేర చరిత్ర, పలు కేసుల్లో నిందితుడు. ఈ నిందితునితో వీరికి సన్నిహిత్యం పెరిగి నేర ప్రపంచంలో దిగి పలు రకాల నేరాలు చేసి పోలీసులకు సవాళ్ళు వదిలారు. ఈ 6 గురి నిందితులపై పలు పోలీస్ స్టేషన్లు నిఘా ఏర్పాటు చేయగా.. రెండు రోజుల క్రితం పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 6లక్షల నగదు, కారు, 6 మొబైల్ ఫోన్లు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి వెంకట్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఆయన అన్నారు. నిందితులను చాక చక్యంగా పట్టుకున్న వంగూర్, వెల్దండ మండల సీఐ, ఎస్ఐ లను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.






