ఏటీసీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

by Ratna Kumari |

మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు.

ఏటీసీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన
X

దిశ, వంగూర్ : మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏటీసీ ఏర్పాటు కోసం అనువుగా ఉన్న భూమిని ప్రత్య క్షంగా సందర్శించి, స్థల పరిమాణం చేరుకునే మార్గాలు, మౌలిక వస తుల లభ్యత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను భూమికి సంబంధించిన రికార్డులు, యాజమాన్య వివరాలు, అందు బాటులో ఉన్న విస్తీర్ణం వంటి విషయాలను అడిగి తెలుసుకు న్నారు. ఏటీసీ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని ఖరారు చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మార్గదర్శకాలను తక్షణమే విడుదల చేయాలని తహసిల్దారు ను ఆదేశించారు. నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ భూమి ఎంపిక విషయంలో ఏటీసీకి చెందిన సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని తుదినిర్ణ యం తీసుకోవాలని సూచించారు.

భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసి, అన్ని పరిపాలనా అనుమతులను త్వరగా పూర్తి చేయాలని, ఫైళ్లను ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఏటీసీ భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులు, సాంకేతిక సిబ్బంది, నిర్మాణ సంస్థల ఎంపిక వంటి అంశాలను సమయానుకూలంగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ప్రాంతీయ యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడంతో పాటు డిజిటల్, టెక్నికల్ రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించే అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ టంతో పాటు స్థానిక ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్, మండల తహసిల్దార్ మురళీమోహన్ పాల్గొన్నారు.

Next Story