- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల అన్నం మేము తినలేం సారూ..
ఇటీవల మాగనూరులో ఫుడ్ పాయిజన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రతిపక్షాలు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

దిశ, నారాయణపేట ప్రతినిధి: ఇటీవల మాగనూరులో ఫుడ్ పాయిజన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రతిపక్షాలు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. మాగనూరు ఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ మెనూ ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాకుండా నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడక్కడ భోజనంలో నాణ్యత లోపిస్తుంది. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పురుగులు వచ్చాయి. దీంతో విద్యార్థులు ఎవరు కూడా భోజనం చేయకపోవడంతో, సమాచారం తెలుసుకున్న పిడిఎస్ యు నాయకులు అక్కడికి చేరుకొని విద్యార్థులతో కలిసి పాఠశాలల్లోనే ధర్నా నిర్వహించారు.
ఇదే మొదటి సారి కాదు చాలా సందర్భాల్లో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నారని వంట ఏజెన్సీకి అనేక సార్లు చెప్ప డం జరిగిందన్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పిన వాళ్లలో మార్పు రాలేదని, మెనూ కూడా పాటించని పరిస్థితి ఉందన్నారు.ఈ రోజు కూడా మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో.. విద్యార్థులను అదే భోజనం తినాలని ఒత్తిడి తేవడం జరిగిందన్నారు. విద్యార్థులు పురుగులు ఉన్నాయని చెప్తే రోజు వచ్చి బియ్యంలో పురుగులను ఏరి బియ్యం ఇవ్వండి అని వంట ఏజెన్సీ అనడం ఎంతవరకు సమంజసమన్నారు.మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో 100 మంది విద్యార్థులు భోజనం చేయలేదు. మళ్లీ వాళ్లకు భోజనం వండి పెట్టడం జరిగిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందురాజులు, మధ్యాహ్నం భోజనం జిల్లా పర్యవేక్షకులు యాదయ్య అక్కడికి చేరుకొని వంట ఏజెన్సీ వర్కర్లకు రోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని,మెనూ పాటించాలని సీరియస్ గా హెచ్చరించారు. ఇకపై ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో శాంతించారు. కాగ జిల్లా కేంద్రంలో భోజనంలో పురుగులు రావడం.. ఇదే జిల్లాకు చెందిన మాగనూరులో పుడ్ పాయిజన్ తీవ్ర సంచలనం గా మారితే కూడా జిల్లా కేంద్రంలో తిరిగి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.






