తాగిన మైకం..6 చిన్నారిపై అఘాత్యం

by velandi.Saikiran |   (  Updated:2026-02-12 19:28:21  IST  )

తాగిన మైకంలో చిన్నారిపై అసభ్య కరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి రెండవ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

తాగిన మైకం..6 చిన్నారిపై అఘాత్యం
X

తాగిన మైకం..6 చిన్నారిపై అఘాత్యం

దిశ, కల్వకుర్తి : బాలికకు భద్రత కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పసి మనసులకు పెనుగాయాలు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో చోటుచేసుకుంది. తాగిన మైకం లో చిన్నారిపై అసభ్య కరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు నమోదైంది. తాగిన మైకంలో చిన్నారిపై అసభ్య కరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి రెండవ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే, గురువారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డు లో గల డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న ఓ 6 యేండ్ల చిన్నారి ప‌ట్ల‌ రాజు (33) అనే వ్యక్తి అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రించాడు.

అదే మేడ పైకి తీసుకెళ్లి అసభ్య కరంగా ప్రవర్తించి, అరిస్తే చంపేసి డ్రమ్ లోకి పడేస్తా అనే బెదిరింపులకు పాల్పడ్డాడు. అదే సమయంలో పొరిగింటి వాళ్ళు ఇద్దరు, మేడపైకి వెళ్లగా రాజును ప్రశ్నించారు. దీంతో అక్కడి నుండి పరార‌య్యాడు నిందితుడు రాజు. ఈ విషయాన్ని గమనించిన సాక్షులు తల్లికి, మేనమామకు సమాచారం అందించారు. అటు రాజుకు దేహశుద్ధి చేసిన ఆ కాలనీ వాసులు, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. అటు ఈ సంఘ‌ట‌న‌పై పోక్సో చట్టం, బెదిరింపు కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ 2 రాజశేఖర్ తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story