ఉపాధి హామీ పనుల అవకతవకలపై టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు

by Ratna Kumari |

దిశ, ఉండవెల్లి : 2024-25ఆర్థిక సంవత్సరం లో జరిగిన ఉపాధి హామీ పనుపై మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్డిఓ నర్సింగరావు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉపాధి హామీ పనుల అవకతవకలపై టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
X

దిశ, ఉండవెల్లి : 2024-25ఆర్థిక సంవత్సరం లో జరిగిన ఉపాధి హామీ పనుపై మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్డిఓ నర్సింగరావు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 15 గ్రామ పంచాయతీల లో జరిగిన ఉపాధి హామీ పనులు సీసీ రోడ్ల నిర్మాణం హరితహారం ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు వందరోజుల పని కల్పన వంటి పనులతో పాటు రైతు సంబంధించిన పొలం పనులు కోళ్ల ఫారం షెడ్ల నిర్మాణం పశువుల షెడ్ల నిర్మాణం వంటి మూడు కోట్ల రూపాయల పనులపై సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వహించి అవకతవకలకు పాల్పడిన ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లకు ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లకు డిఆర్డిఓ షోకజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సకాలంలో తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిన ఏపీఓపై డిఆర్డిఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు వారం రోజుల్లోగా ఉపాధ్యాయునికి సంబంధించిన పనుల రికార్డులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 1,50,000 రూపాయల పెనాల్టీ, రికవరీ సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ లో నుండి డబ్బులు రికవరీ చేసే జమ చేయాలని డి ఆర్ డి ఓ అధికారులకు సూచించారు.

Next Story