వరసిద్ధి వినాయక పత్తి మిల్లులో షార్ట్ సర్క్యూట్..!

by Ratna Kumari |

దిశ, ఉండవెల్లి : మండలంలోని 44వ జాతీయ రహదారిపైన్న వరసిద్ధి వినాయక పత్తి మిల్లులో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా పత్తి నిల్వలు, జిన్నింగ్ చేసిన విత్తనాలు

వరసిద్ధి వినాయక పత్తి మిల్లులో షార్ట్ సర్క్యూట్..!
X

దిశ, ఉండవెల్లి : మండలంలోని 44వ జాతీయ రహదారిపైన్న వరసిద్ధి వినాయక పత్తి మిల్లులో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా పత్తి నిల్వలు, జిన్నింగ్ చేసిన విత్తనాలు ఉండటంతో మిల్లు యాజమాన్యం అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. మంటలు చెలరేగడంతో రైతులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలు చెలరేగే అవకాశం ఉన్నాయేమోనని పైరింజన్ ను నిలిపి ఉంచారు. పత్తి మిల్లులో అగ్ని ప్రమాదాలకు ఉపయోగించే ఇలాంటి సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో తెప్పించుకోవడం కోస మెరుపు.

పత్తి కొనకపోతే ఆత్మహత్య చేసుకుంటాం

ఎన్నో వ్య‌య‌ ప్రయాసలు కూర్చుకొని స్లాట్ బుక్ చేసుకుని వాహనాల్లో తీసుకొని వచ్చిన రైతుల పత్తిని కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు మార్కెటింగ్ అధికారి పుష్పమ్మకు హెచ్చరించారు. పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు నిలిపి వేస్తున్న‌ట్టు సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా నిలిపి వేయడం ఎంత వరకు సమంజ‌సం అని రైతులు నిలదీశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఇవాళ‌ స్లాట్ బుకింగ్ చేసిన రైతుల పత్తిని కొనుగోలు చేసే విధంగా చూస్తానని జిల్లా అధికారి హామీ ఇచ్చారు.

Next Story