శివాజీ జయంతి శాంతియుతంగా నిర్వహించాలి : ఎస్పీ జానకి

by Ratna Kumari |

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శాంతియుతంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి హెచ్చరించారు.

శివాజీ జయంతి శాంతియుతంగా నిర్వహించాలి :  ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శాంతియుతంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి హెచ్చరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆమె పలు సూచనలు జారీ చేశారు. ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుంటూ సూచించిన మార్గాల్లోనే ర్యాలీ నిర్వహించాలని, ప్రధాన రహదారులు దిగ్బంధం చేయకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమయపాలన పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే శబ్ధ కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, డిజే లు, అధిక శబ్దం పరికరాలు వాడకూడదని, వాడినట్లైతే కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఉద్రిక్తతలకు దారితీసే నినాదాలు, ప్రవర్తనలు చేయరాదని, ర్యాలీ భద్రత కోసం నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను నియమించాలని, మహిళలు, పిల్లలు, వృద్దులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి ర్యాలీలో పాల్గొనడం పూర్తిగా నిషేధమని, పోలీసులు ఆదేశాలు పాటించని నిర్వాహకులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని ఆమె హెచ్చరించారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఇట్టి నియమ నిబంధనలను అమలు పరుస్తున్నామని, ప్రజలు సహకరించాలని ఎస్పీ జానకి కోరారు.

Next Story