- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేవాలాల్ మహారాజ్ జయంతి..మంత్రి వాకిటి కీలక ప్రకటన
సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.

దిశ, ఊట్కూర్ : సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి తాండాలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, జిల్లా ఎస్పీ వినీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ గిరిజనుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. బంజారా సమాజ అభ్యున్నతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.
విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో గిరిజనులు ముందంజలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తండాల్లో నివసించే ప్రతి కుటుంబం తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. చదువు ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం తండా వాసులతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ లంబాడా సాంప్రదాయ నృత్యంలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఆర్డీవో రామచంద్రనాయక్, తహసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్, సిఐ రామ్ లాల్, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ మోహన్ నాయక్, సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






