పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బోల్తా పడిన డీసీఎం...పలువురికి గాయాలు

by velandi.Saikiran |   (  Updated:2025-09-29 17:15:44  IST  )

కర్నూలు జిల్లాలో జరిగిన పెళ్లి వేడుకల(వలిమ)కు 60 మందితో వెళ్లిన లారీ తిరుగు ప్రయాణంలో ప్ర‌మాదానాకి గురైంది

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బోల్తా పడిన డీసీఎం...పలువురికి గాయాలు
X

-రెండు గంటలుగా డీసీఎం లోనే ఇరుక్కున్న మహిళ, ఓ చిన్నారి

-పదిమందికి పైగా గాయాలు

-జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి వద్ద ప్రమాదం

దిశ, ఉండవెల్లి : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల స్టేజి సమీపంలో సోమవారం సాయంత్రం పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న డీసీఎం జాతీయ రహదారి పక్కన బోల్తా పడింది. గద్వాల మండలం జమ్మిచేయుటకు చెందిన దాదాపుగా 50 మంది కర్నూల్లో జరిగిన వలీమా (వివాహ వేడుకలు)కు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వర్షంలో డి సి యం వేగంగా వస్తుండగా రోడ్డు ప్రక్కన నిలిచి ఉన్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.. ఈ సంఘటనలో పదిమందికి పైగా గాయాలు అయ్యాయి. జరీనా అనే మహిళ తో పాటు సమీరా అనే చిన్నారి డీసీఎం లో ఇరుక్కు పోయారు. కాపాడాలి అంటూ వారు రోదనలు చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలించివేసింది. డీసీఎం లో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు హైవే సిబ్బంది, స్థానిక పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story